KNR: భూభారతి రీ సర్వేను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. జిల్లాలో 70 గ్రామాలు ఎంపిక కాగా 16 గ్రామాల్లో సర్వే కొనసాగుతోందన్నారు. మరో 15 గ్రామాల్లో వెంటనే ప్రారంభించాలని సూచించారు. రైతులకు ముందస్తు సమాచారం అందించి శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రస్తుతం 15 రోవర్లతో సర్వే జరుగుతుండగా, అదనంగా 16 రోవర్లను ఏర్పాటు చేశారని తెలిపారు.
తెలంగాణ
'భూభారతి రీ సర్వేను వేగవంతం చేయాలి'


