హైదరాబాద్: 28°C
వార్తలు

అలర్ట్.. నేడు పిడుగులతో కూడిన వర్షాలు

AP: అల్పపీడనం ప్రభావంతో ఇవాళ పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. శ్రీకాకుళం జిల్లాలో భారీ, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అత్యవసర సమయాల్లో టోల్‌ఫ్రీ నంబర్ల 112, 1070ను సంప్రదించాలి.