హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి: ఎస్సై

KDP: సిద్ధవటం(M)భాకరాపేట ఫారెస్ట్ చెక్‌పోస్ట్ సమీపంలో ఎస్సై హారిక శుక్రవారం వాహనాలను తనిఖీ చేశారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి, వాహన పత్రాలు వెంట ఉంచుకోవాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన 10 మంది ద్విచక్ర వాహనదారులకు రూ.185 చొప్పున జరిమానా విధించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాదాల నివారణకు సహకరించాలని SI కోరారు.