హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు ఖమ్మంలో జనసేన శంఖారావం

TG: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రేపు జనసేన శంఖారావ సభను నిర్వహించనున్నారు. సభకు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన 2 వేల మంది ప్రతినిధులు హాజరవుతున్నారని జనసేన నేత, NLG, WGL, KMM పట్టభద్రుల నియోజకవర్గ MLC అభ్యర్థి గడల శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలో జనసేనను బలోపేతం చేసే ప్రక్రియలో సభను ఏర్పాటు చేశామన్నారు. కాంగ్రెస్‌, BRSకు ప్రత్యామ్నాయంగా పార్టీ విస్తరిస్తోందన్నారు.