హైదరాబాద్: 28°C
వార్తలు

మూడు రోజులు హాలిడేస్

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి నుంచి వరుసగా మూడు రోజులు సెలవులు ప్రకటించడంతో స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులు మూతపడనున్నాయి. రెండో శనివారం, ఆదివారం, వినాయక చవితి సందర్భంగా ఈ సెలవులు ఇచ్చారు. దీంతో సొంతూళ్లకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థుల రద్దీతో హైదరాబాద్-విజయవాడ, బెంగళూరు హైవేపై వాహనాలు కిక్కిరిసిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో గణేష్‌ ఉత్సవాల సందడి ప్రారంభమైంది.