హైదరాబాద్: 28°C
తెలంగాణ

చేతికందే ఎత్తులో విద్యుత్ తీగలు!

BHNG: పాతగుట్ట సమీపంలోని పెద్దిరెడ్డిగూడెంలో విద్యుత్ తీగలు చేతికందే ఎత్తులో వేలాడుతుండటంతో ప్రమాదం పొంచి ఉందని రైతు సాధునేని ధనంజయరావు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ పొలంలో నాట్లు వేసే సమయంలో తీగలు తగిలే ప్రమాదం ఉందన్నారు. మనుషులతో పాటు పశువుల ప్రాణాలకు ముప్పు ఉందని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి తీగలను సరిచేసి ప్రమాదాన్ని నివారించాలని కోరారు.