హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

MDK: మెదక్‌లోని 132 కేవీ, 33 కేవీ సబ్‌స్టేషన్ల మరమ్మతులు, లైన్ల కింద చెట్ల కొమ్మల నరికివేత పనుల కారణంగా శని, ఆదివారాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుందని విద్యుత్ శాఖ అధికారులు ప్రకటించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పట్టణంలో విద్యుత్ నిలిపివేస్తున్నట్లు ఏడీఈ మోహన్ బాబు, ఏఈ నవీన్ తెలిపారు. వినియోగదారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.