హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పట్టణ అభివృద్ధికి ప్రాధాన్యం: ఎమ్మెల్యే

కృష్ణా: పెడన ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ పట్టణ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ తెలిపారు. పట్టణంలోని పలు వార్డుల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, విద్యుత్ సదుపాయాల ప్రారంభోత్సవాలు నిర్వహించారు. 1వ వార్డులో రూ.11 లక్షలతో వివేకానంద పార్కు, 21వ వార్డులో కల్వర్టులు, సీసీ డ్రైన్ పనులకు శ్రీకారం చుట్టారు.