ASR: పాడేరు మండలం తొట్లగొందిలో నిన్న పొలంబడి కార్యక్రమం నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో రైతులకు వరిలో ఆకుముడత పురుగు నివారణపై అవగాహన కల్పించారు. వేపనూనె 5 మి.లీ. లీటర్ నీటిలో కలిపి పంటపై పిచికారీ చేస్తే పురుగు నివారణ సాధ్యమని తెలిపారు. అలాగే కొబ్బరి తాడును పైరుపై లాగడం ద్వారా ఆకుముడత పురుగు నీటిలో పడి చనిపోతాయని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఆకుముడత పురుగు నివారణపై అవగాహన


