కడప: రిమ్స్ పరిధిలోని HP గ్యాస్ ప్లాంట్ వద్ద పేకాట ఆడుతున్న ఏడుగురిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 8,400 నగదు, 52 పేకముక్కలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజగోపాల్ తెలిపారు. జూదం, బెట్టింగ్ వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
ఏడుగురు జూదరుల అరెస్ట్..!


