హైదరాబాద్: 28°C
వార్తలు

గొట్టె కనకవ్వకు మరో స్మారక పురస్కారం

TG: సిద్ధిపేట జిల్లా బొడిగపల్లికి చెందిన జానపద గాయని గొట్టె కనకవ్వ మరో పురస్కారానికి ఎంపికయ్యారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తండ్రి పొన్నం సత్తయ్య ఛారిటబుల్ ట్రస్టు వారి జీవిత సాఫల్య అవార్డుకు ఎంపికయ్యారు. ఈనెల 13న రవీంద్రభారతిలో అందజేయనున్నారు. ఆమె ఇప్పటివరకు 300 పైగా పాటలు పాడారు. ఏ పాటైన విని కంఠస్థం చేసి పాడటం విశేషం. 2022లో తెలంగాణ విశిష్ఠ మహిళా పురస్కారం అందుకున్నారు.