హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పశ్చిమ డెల్టా కాలువలకు నీటి విడుదల

GNTR: పశ్చిమ డెల్టా కాలువలకు అధికారులు శుక్రవారం 2,618 క్యూసెక్కుల సాగునీటిని విడుదల చేశారు. దుగ్గిరాల లాకుల నుంచి బ్యాంక్ కెనాల్‌కు 476, ఈస్ట్ ఛానల్‌కు 245, వెస్ట్ ఛానల్‌కు 235, హైలెవల్ ఛానల్‌కు 96 క్యూసెక్కులు పంపగా, కొమ్మమూరు కాలువకు అత్యధికంగా 820 క్యూసెక్కులు విడుదల చేశారు. ఆయకట్టు పంటల అవసరాల కోసం ఈ సరఫరా కొనసాగుతోంది.