హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో నేరాలపై అవగాహన

GDWL: గట్టు మండలం ఇందువాసిలో పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో శుక్రవారం రోడ్డు భద్రత, సైబర్ నేరాలు, పోక్సో చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. సైబర్ మోసాలకు గురైతే 1930కు, అత్యవసర సమయాల్లో 112కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. వేధింపులు ఎదురైతే షీ-టీమ్‌ను ఆశ్రయించాలని సూచించారు.