KRNL: రోడ్డు ప్రమాదాల నివారణకు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాలతో పోలీసులు ‘స్టాప్–వాష్ అండ్ గో’ కార్యక్రమం చేపట్టారు. ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు, కర్నూలు పరిధిలోని జాతీయ రహదారి వాహనాలను అర్ధరాత్రి తనిఖీ చేస్తున్నారు. డ్రైవర్లకు నీటితో ముఖం కడిగించి, వాహన పత్రాలు, లైసెన్సులను పరిశీలిస్తున్నారు. అతివేగం, రాంగ్‌రూట్‌లో ప్రయాణించవద్దని డ్రైవర్లకు సూచిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
డ్రైవర్ల భద్రతకు పోలీసుల వినూత్న కార్యక్రమం


