హైదరాబాద్: 28°C
తెలంగాణ

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు

MBNR: పాలమూరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పిల్లలమర్రి రోడ్డు అంధుల పాఠశాలలో శుక్రవారం ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కార ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఇందిర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉపాధ్యాయ వృత్తి ద్వారా ఎంతోమంది విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్ది జీవితంలో స్థిరపడేలా చేస్తున్నారని ఆమె అన్నారు.