హైదరాబాద్: 28°C
తెలంగాణ

శిల్పారామాన్ని సందర్శించిన కలెక్టర్

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని శిల్పారామాన్ని కలెక్టర్ కుష్బూ గుప్తా శుక్రవారం సందర్శించారు. స్టాళ్లను పరిశీలించి, వాటిని ఎవరెవరికి కేటాయించారనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేటాయించిన అన్ని స్టాళ్లను వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి శిల్పారామంలోని అన్ని స్టాళ్లు పూర్తిస్థాయిలో ప్రారంభం కావాలని సూచించారు.