హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాముకాటుతో కార్మికుడు మృతి

NRPT: ఊట్కూర్ మండలం పగిడిమర్రిలో విషాదం చోటు చేసుకుంది. భవన నిర్మాణ పనులకు వెళ్తున్న గుడ్డి బాలరాజు (39)ను గ్రామ శివారులో పాము కాటేసింది. వెంటనే కుటుంబ సభ్యులు నారాయణపేట జిల్లా ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. భార్య కిష్టమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేష్ తెలిపారు.