హైదరాబాద్: 28°C
తెలంగాణ

క్రమశిక్షణతో విధులు నిర్వహించాలి: ఎస్పీ

NRPT: జిల్లాలో గణేష్ ఉత్సవాలు, నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని ఎస్పీ డాక్టర్ వినీత్ సూచించారు. నారాయణపేట పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో శుక్రవారం ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీస్ సిబ్బందితో సమావేశమై బందోబస్తు, విధులపై దిశానిర్దేశం చేశారు. కేటాయించిన విధుల్లో పూర్తి అప్రమత్తంగా, క్రమశిక్షణతో వ్యవహరించాలని సూచించారు.