GDWL: గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో పర్యావరణహితమైన మట్టి గణపతులనే పూజించాలని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. శుక్రవారం గద్వాల జిల్లా పోలీస్ కార్యాలయంలో సిబ్బందికి మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. మండపాల నిర్వాహకులు పోలీసుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని, పోలీస్ పోర్టల్లో వివరాలు నమోదు చేయాలని సూచించారు. ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని పేర్కొన్నారు.
తెలంగాణ
మట్టి గణపతులనే పూజిద్దాం:ఎస్పీ


