గుజరాత్ తీరంలోని కాండ్లా నౌకాశ్రయానికి సమీపంలో రెండు వాణిజ్య నౌకలు ఢీకొన్నాయి. వెంటనే భారత కోస్ట్ గార్డ్ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. ఓ నౌకలో 24 మంది సిబ్బంది ఉండగా.. వారిలో 21 మందిని సురక్షితంగా తరలించారు. నౌక కార్యకలాపాలు కొనసాగించేందుకు ముగ్గురు సిబ్బంది అందులోనే ఉన్నారు. ఎంవీ కేమ్యాక్స్ ఎంపరర్, ఎంపీ ట్రూ మారినర్ అనే వాణిజ్య నౌకలు ఢీకొన్నట్లు సమాచారం.
వార్తలు
గుజరాత్ తీరంలో రెండు వాణిజ్య నౌకలు ఢీ


