ముంబైలో అత్యంత ప్రసిద్ధి చెందిన లాల్‌బాగ్చా రాజా (లాల్‌బాగ్ గణపతి) తొలి రూపాన్ని ఇవాళ సాయంత్రం అధికారికంగా విడుదల చేశారు. ఏటా వినాయక చవితి వేడుకలకు ముందే ఈ ఐకానిక్ విగ్రహం మొదటి రూపాన్ని భక్తుల కోసం ఆవిష్కరించడం ఆనవాయితీ. లాల్‌బాగ్చా రాజా సర్వజనిక్ గణేశోత్సవ్ మండల్ ఈ ఏడాది 93వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ గణపతిని నిత్యం 15 లక్షలకు పైగా భక్తులు దర్శించుకుంటారు.
వార్తలు
'లాల్‌బాగ్చా రాజా' తొలి రూపం ఆవిష్కరణ


