హైదరాబాద్: 28°C
వార్తలు

బ్రిక్స్ సదస్సు వేళ ఢిల్లీకి భారీ వర్ష సూచన

బ్రిక్స్ సదస్సు వేళ ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఢిల్లీలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే ఢిల్లీతోపాటు యూపీ, బీహార్ సహా 12 రాష్ట్రాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించింది.