హైదరాబాద్: 28°C
వార్తలు

పలు కాలనీల్లో పవర్ కట్

ADB: విద్యుత్ లైన్ మరమ్మతు పనుల నిమిత్తం శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని అసిస్టెంట్ ఇంజనీర్ వినోద్ తెలిపారు. దీనివల్ల పట్టణంలోని ఖుర్షీద్ నగర్, సుందరయ్య నగర్, ఇంద్రనగర్, గాంధీనగర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. విద్యుత్ అంతరాయం సమయంలో వినియోగదారులు సహకరించాలన్నారు.