హైదరాబాద్: 28°C
వార్తలు

భారీ పేలుడులో టీఎంసీ నేత ఇల్లు ధ్వంసం

బెంగాల్‌లో టీఎంసీ నేత ద్విజెన్ మండల్ నివాసంలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి బిల్డింగ్ కింది అంతస్తు పూర్తిగా ధ్వంసమైంది. అంతేకాకుండా సమీపంలోని పలు ఇళ్లు కూడా దెబ్బతిన్నాయి. గ్యాస్ సిలిండర్ పేలటం వల్ల ఈ ప్రమాదం  జరిగిందని పోలీసులు అనుమానిస్తుండగా.. బీజేపీ మాత్రం ఇంట్లో బాంబులు ఉంచినట్లు ఆరోపిస్తుంది. బీజేపీ నాయకులపై వేయడానికే వాటిని దాచినట్లు చెబుతోంది.