హైదరాబాద్: 28°C
వార్తలు

మినరల్స్ రంగంలో భారత్ స్వయం సమృద్ధి: కేంద్ర మంత్రి

క్రిటికల్ మినరల్స్ రంగం భారత్‌కే కాకుండా ప్రపంచానికే అత్యంత కీలకమైనదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇవి లేకుండా ఆధునిక సాంకేతిక అభివృద్ధి సాధ్యం కాదని వెల్లడించారు. ఫోన్లు, అంతరిక్ష పరిజ్ఞానం నుంచి నిత్యావసర ఎలక్ట్రానిక్స్ వరకు అన్నింటికీ ఇవి అవసరమని చెప్పారు. ఈ రంగంలో విదేశాలపై ఆధారపడే పరిస్థితిని తగ్గించి దేశాన్ని స్వయం సమృద్ధిగా మార్చడమే తమ లక్ష్యమని తెలిపారు.