హైదరాబాద్: 28°C
వార్తలు

భూమికకు సీఎం సహాయ నిధి

కర్నూలు రూరల్ మండలం పూడూరుకు చెందిన చిన్నారి భూమిక సంపంగి తలసేమియాతో బాధపడుతున్న విషయం ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి దృష్టికి వచ్చింది. ఆయన చొరవతో సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన రూ.10 లక్షల చెక్కును శుక్రవారం కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యేకు వారు కృతజ్ఞతలు తెలిపారు.