హైదరాబాద్: 28°C
వార్తలు

సెలవు రోజుల్లో తరగతులపై చర్యలు తీసుకోవాలి:AISF

గుంటూరు జిల్లాలో ప్రభుత్వ సెలవు రోజుల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని AISF జిల్లా కార్యదర్శి యశ్వంత్ రఘువీర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు RIO సునీత, RJD లింగేశ్వరరెడ్డికి వినతి పత్రాలు అందజేశారు. సెలవు రోజుల్లో తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులను మానసికంగా వేధిస్తున్నారని ఆరోపించారు.