హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు వైసీపీ ఎన్నికల సన్నాహక సమావేశం

SKLM: ఆమదాలవలస పట్టణంలోని శారద కల్యాణ మండపంలో శనివారం ఉదయం 10 గంటలకు స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించనున్నట్లు వైసీపీ ఇంఛార్జ్ చింతాడ రవికుమార్ తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆమదాలవలస నియోజకవర్గ వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని సమావేశాన్ని జయప్రదం చేయాలని కోరారు.