VZM: జిల్లాలో ఇంటింటికీ కుళాయి ఏర్పాటుకు హర్ ఘర్ జల్ పథకం కింద రూ.479.63 కోట్లు మంజూరు కావడంపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శుక్రవారం హర్షం వ్యక్తం చేశారు. జిల్లాలో 1,329 గృహాలకు సంబంధించి 711 పనులకు నిధులు మంజూరయ్యాయని తెలిపారు. 2029 నాటికి పనులను వంద శాతం పూర్తి చేసేలా అధికారులు వేగవంతం చేయాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
ఇంటింటికీ కుళాయి కోసం నిధులు మంజూరు


