హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రైవేట్ ఉద్యోగాల కోసం జాబ్ మేళా

ADB: ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ ఐటీఐలో ఈ నెల 16వ తేదీన ఉదయం 11 గంటలకు ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగాల ఎంపిక కోసం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి మిల్కా శుక్రవారం తెలిపారు. ఈ మేళా ద్వారా మొత్తం 57 ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఆసక్తి గల నిరుద్యోగ యువతీ యువకులు బయోడేటా, సర్టిఫికెట్ల జిరాక్స్‌లతో హాజరు కావాలని సూచించారు.