కోనసీమ: అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు సకాలంలో అందేలా టీడీపీ నాయకులు, కార్యకర్తలు బాధ్యతగా కృషి చేయాలని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పిలుపునిచ్చారు. శుక్రవారం మండపేట పార్టీ కార్యాలయంలో పట్టణ, మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్‌ఛార్జ్‌లు, ముఖ్య నాయకులతో ప్రత్యేక క్యాడర్ సమావేశం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
కార్యకర్తలు బాధ్యతగా కృషి చేయాలి:ఎమ్మెల్యే


