హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మొక్కలుగా మారే మట్టి గణపతులు

ELR: పర్యావరణ పరిరక్షణపై చైతన్యం, చిన్నారుల్లో సృజనాత్మకత పెంపొందించేలా భీమడోలులోని మానసా స్కూల్ విద్యార్థులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. గణపతి నవరాత్రులను పురస్కరించుకుని మట్టితో పర్యావరణహిత గణపతి ప్రతిమలు తయారు చేసి, వాటిలో పండ్లు, పూల విత్తనాలను పొందుపరిచారు. పూజల అనంతరం వాటిని నాటి మొక్కలు పెంచేలా పాఠశాల యాజమాన్యం ప్రోత్సహించింది.