KKD: యు.కొత్తపల్లి మండలం పాత ఇసుకపల్లి గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ కార్యకర్త పింకీ నూకరాజు పిడుగుపాటుకు మృతి చెందారు. విషయం తెలుసుకున్న టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ శుక్రవారం నూకరాజు కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వం, పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం రూ.10 వేల ఆర్థిక సాయం అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
పిడుగుపాటుకు మృతి.. కుటుంబానికి వర్మ పరామర్శ


