దేశంలోని యువశక్తి సామర్థ్యంపై తమకు ఎలాంటి సందేహాలు లేవని కేంద్రమంత్రి నిర్మలమ్మ తెలిపారు. భారత్ సాధిస్తున్న అద్భుత ప్రగతికి ఇక్కడ ఉన్న యువత, నవకల్పనలే కారణమని ప్రశంసించారు. 2047 నాటికి వికసిత్ భారత్ ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కొందరు వ్యక్తులు దేశ వేగాన్ని, యువత అపార సామర్థ్యాలను శంకించేందుకు కారణాలు వెతుకుతూనే ఉంటారని ఎద్దేవా చేశారు.
వార్తలు
2047 నాటికి 'వికసిత భారత్' ఖాయం: ఆర్థిక మంత్రి


