హైదరాబాద్: 28°C
వార్తలు

పుతిన్‌కు మోదీ కీలక విజ్ఞప్తి

ప్రధాని మోదీతో రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీ సందర్భంగా ఇరు నేతల మధ్య ఉక్రెయిన్ యుద్ధంపై చర్చ జరిగింది. ఈ తరుణంలో యుద్ధాన్ని ఆపాలని పుతిన్‌కు మోదీ విజ్ఞప్తి చేశారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తామని చెప్పారు. అలాగే నల్ల సముద్రంలో భారత నావికుల భద్రతపైనా ఇరు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం రష్యాకు రావాలని మోదీని పుతిన్ ఆహ్వానించారు.