సత్యసాయి జిల్లాలో కరువు నివారణ, నేల సారం పెంపునకు ‘ప్రాజెక్ట్ పునర్జీవనం’ చేపట్టినట్లు కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ తెలిపారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో వివరాలు వెల్లడించారు. మల్బరీ వ్యర్థాలతో బయోచార్ తయారు చేసి ఐదేళ్లలో 5,000 ఎకరాల్లో నేల ఆరోగ్యం మెరుగుపరచడమే లక్ష్యమన్నారు. ఐఐటీ గువాహటి సాంకేతిక సహకారంతో ప్రాజెక్టు అమలు చేస్తున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కరువు నేలలకు ‘పునర్జీవనం’: కలెక్టర్


