హైదరాబాద్: 28°C
వార్తలు

ఎల్‌నినో ప్రభావం.. వరి సాగు డౌన్

VZM: బొండపల్లి మండలంలో ఖరీఫ్‌లో 1068 హెక్టార్లలో వరి సాగు జరిగిందని మండల వ్యవసాయ అధికారి దాసరి గిరిబాబు శుక్రవారం సాయంత్రం తెలిపారు. సాధారణ వరి సాగు విస్తీర్ణం 3354 హెక్టార్లు కాగా, ఎల్‌నినో కారణంగా వర్షాలు తక్కువగా కురిసి విస్తీర్ణం తగ్గిందన్నారు. మిగిలిన ఖాళీ భూముల్లో సాగుకు ప్రభుత్వం రాయితీపై అపరాలు, ఇతర విత్తనాలు అందిస్తుందని చెప్పారు.