హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: CITU

W.G: భీమవరం మండలం రాయలం పంచాయితీలో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న 22 మంది పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏపీ గ్రామపంచాయతీ CITU జిల్లా అధ్యక్షుడు ఎం.ఆంజనేయులు డిమాండ్ చేశారు. శుక్రవారం పంచాయతీ కార్యాలయంలో కార్మికులతో కలిసి కార్యదర్శికి వినతిపత్రం అందజేశారు. కార్మికుల సమస్యలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.