హైదరాబాద్: 28°C
వార్తలు

భార్య పిల్లలను కొట్టి చంపిన వ్యక్తి

రాజస్థాన్ జైపూర్‌లో దారుణం చోటుచేసుకుంది. భార్యతో సహా ముగ్గురు పిల్లలను ఓ వ్యక్తి అత్యంత దారుణంగా కొట్టి చంపాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో వారంతా నిద్రిస్తున్న సమయంలో ఇటుకతో కొట్టి నిందితుడు రాహుల్ కొట్టి హత్య చేశాడు. రక్తపు మడుగులో మృతదేహాలను గుర్తించిన బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన అధికారులు రాహుల్ కోసం గాలిస్తున్నారు.