KDP: సిద్ధవటం మండలం కనుమలోపల్లి సమీపంలో వెలసిన శ్రీ మానసా దేవి ఆలయంలో పోలాల అమావాస్య సందర్భంగా శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపతి పూజ, అగ్ని హోమం, అభిషేకం, పారాయణం, తదితర కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో చేపట్టారు. అనంతరం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఆలయం చుట్టూ గ్రామోత్సవంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త లక్ష్మయ్య భక్తులకు అన్న వితరణ ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్
సిద్ధవటంలో మానసా దేవికి ప్రత్యేక పూజలు


