హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

50 మందికి టిట్కో గృహాలు అప్పగింత

PLD: నరసరావుపేట మున్సిపల్‌ బంగ్లాలో టిడ్కో గృహాల స్వాధీన కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు 50 మంది లబ్ధిదారులకు ఇళ్లను అప్పగించారు. ఇళ్లు మంజూరు కాని 46 మంది నాన్‌-అలాటీలకు వారు చెల్లించిన రూ.21.52 లక్షలను చెక్కుల రూపంలో తిరిగి అందజేశారు. ఇప్పటివరకు సుమారు 850 టిడ్కో ఇళ్లను అప్పగించామని ఎమ్మెల్యే తెలిపారు.