హైదరాబాద్: 28°C
వార్తలు

అవార్డుల వేదికను మార్చడంపై ఠాక్రే అభ్యంతరం

జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధాన వేదికను గుజరాత్‌కు తరలించడంపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రే అభ్యంతరం వ్యక్తం చేశారు. 72 ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయన్ని ఇప్పుడు కొత్తగా మార్చాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఈ కార్యక్రమాన్ని ఢిల్లీ నుంచి తరలించాలనుకుంటే భారతీయ చలన చిత్ర పరిశ్రమకు ప్రధాన కేంద్రంగా ఉన్న ముంబైను ఎందుకు పరిగణించలేదని నిలదీశారు.