మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లా అమోల్‌పథా గ్రామంలో మద్యం దుకాణాలపై మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడికి దిగారు. మద్యం కారణంగా ఆర్థికంగా చితికిపోవడంతో పాటు గృహహింస పెరిగిపోతోందని ఆరోపించారు. ఈ ఆందోళనను అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులపై కూడా వారు తిరగబడి తరిమికొట్టారు. చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఇలాంటి నిరసనలే కొనసాగుతున్నట్లు స్థానికులు పేర్కొన్నారు.
వార్తలు
పోలీసులను తరిమికొట్టిన మహిళలు


