హైదరాబాద్: 28°C
వార్తలు

అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటాం: పవన్

AP: అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా.. ప్రకృతి సంపద పరిరక్షణకై త్యాగాలు చేసిన అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు. అమరవీరుల త్యాగఫలాలను భావితరాలకు అందించడం మన బాధ్యత అని అన్నారు. అడవుల పరిరక్షణ పట్ల వారి నిబద్ధత తరతరాలకు స్ఫూర్తి అని చెప్పారు. 1939 నుంచి ఇప్పటి వరకు 24 మంది అటవీ సిబ్బంది ప్రాణత్యాగం చేశారని.. వారి కుటుంబాలకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.