పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను అధికారికంగా ముగించడంలో మోదీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తోందని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ ఆరోపించారు. సభ నిరవధిక వాయిదాకు, అధికారిక ముగింపునకు మధ్య 29 రోజుల గ్యాప్ వచ్చిందని, ఇది 2015 నాటి రికార్డును(28 రోజులు) బ్రేక్ చేసిందన్నారు. రాజ్యాంగ సవరణ బిల్లుకు మద్దతు కూడగట్టేందుకే కేంద్రం ఈ వ్యూహం పన్నిందని ఆయన విమర్శించారు.
వార్తలు
మోదీ ప్రభుత్వంపై జైరాం రమేష్ ఫైర్


