AP: రాష్ట్రంలోని కూటమి మిత్ర పక్షాల మధ్య విభేదాలు సృష్టించేందుకు కొందరు కుట్ర చేస్తున్నారని.. TDP AP అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆరోపించారు. కొందరు విదేశాల నుంచి ఫేక్ సోషల్ మీడియా అకౌంట్లు నడుపుతున్నారని అన్నారు. ఈ అకౌంట్లలో పోస్టులు పెట్టి కూటమి కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని.. ఇలాంటి ఫేక్ ఐడీలపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
వార్తలు
కూటమి పక్షాల మధ్య విభేదాలకు కుట్ర: పల్లా


