హైదరాబాద్: 28°C
వార్తలు

కాంగ్రెస్‌పై కాశ్మీర్ సీఎం విమర్శలు

వందేమాతరం పూర్తి గేయం ఆలాపనపై కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ మధ్య వివాదం ముదురుతోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌పై కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా విమర్శలు చేశారు. కాశ్మీరీలు జైలులో ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటోందా? అని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా అధికారిక కార్యక్రమాల్లో వందేమాతరం ఆరు చరణాలు పాడటం తప్పని సరి అని పేర్కొన్నారు. దానిని ఉల్లంఘిస్తే చర్యలు ఉంటాయని ఆయన గుర్తు చేశారు.