హైదరాబాద్: 28°C
వార్తలు

బ్రెజిల్ విదేశాంగ మంత్రితో జైశంకర్ భేటీ

న్యూఢిల్లీలో 18వ బ్రిక్స్ సదస్సు జరగనున్న నేపథ్యంలో విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్.. బ్రెజిల్ విదేశాంగ మంత్రి మౌరో వియరాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, ఇంధనం, వ్యవసాయం, అంతరిక్ష రంగాల్లో ద్వైపాక్షిక సహకారం పెంపుపై వారు చర్చలు జరిపారు. ఐరాస, జీ20లో బహుపాక్షిక సహకారం, ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితులపై వారిరువురు మంతనాలు జరిపారు.