హైదరాబాద్: 28°C
వార్తలు

కూటమిగానే స్థానిక ఎన్నికల్లో పోటీ: మాధవ్

AP: స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిగానే బరిలో దిగుతామని.. BJP AP చీఫ్ మాధవ్ స్పష్టం చేశారు. డబుల్ ఇంజిన్ సర్కార్.. ట్రిపుల్ ఇంజిన్ గ్రోత్ తమ నినాదమన్నారు. అక్టోబర్, నవంబర్ నెలల్లో స్థానిక ఎన్నికలు జరిగే అవకాశం ఉందని గుంటూరులో BJP పదాధికారుల సమావేశంలో తెలిపారు. ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా SEP-15 నుంచి OCT-15 వరకు విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు.