బ్రిక్స్ దేశాల మధ్య ఆర్థిక కార్యకలాపాలు, భద్రత పెరిగితేనే స్వయం సమృద్ధి సాధించగలమని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. బ్రిక్స్ బిజినెస్ ఫోరంలో మాట్లాడిన ఆయన.. సభ్య దేశాల వ్యాపారాలకు మెరుగైన మార్కెట్, భాగస్వాములను సులభంగా కనుక్కునే వాతావరణం కల్పించడమే ప్రధాన లక్ష్యమన్నారు. ఎలాంటి ఆర్థిక కుదుపులైనా తట్టుకునేలా పటిష్టమైన సప్లై చైన్ నెట్‌వర్క్ నిర్మించుకోవాలని సూచించారు.
వార్తలు
‘బ్రిక్స్ దేశాల మధ్య ఆర్థిక భద్రత ముఖ్యం’


